రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసు డీఎస్పీలు మృతి
హైదరాబాద్: తెలంగాణ యాదద్రి జిల్లా చౌట్టుప్పల్ మండలం ఖైతాపురం వద్ద శనివారం వేకువజామున జరిగి ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రగాయాలు పాలైయ్యారు..వివరాల్లో వెళ్లితే….. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో డీఎస్పీలు విధులు నిర్వహిస్తున్న DSPలు మాకా.ఛక్రధర్ రావు(57),,జల్లా.శాంతరావు(54) మృతి,,,ASP కోకా.రామ్ ప్రసాద్(58) హెడ్ కానిస్టేబుల్ రెడ్డిచర్ల.నరసింహరాజు(54) లు విజయవాడలో వున్న హెడ్ క్యార్టర్స్ కు వచ్చి తిరుగి వెళ్లుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది.. వేగంగా వెళ్లుతున్న స్కార్పియో వాహనం వర్షం కారణంగా అదుపుతప్పింది..దింతో ఢివైడర్ ఢీ కొట్టి, రోడ్డుకు ఆవతలి ప్రక్క రోడ్డుపై స్కార్పియో వాహనం పడింది..అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లుతున్న లారీ స్కార్పియోను బలంగా ఢీ కొట్టింది..దింతో కారులో వున్న DSPలు మాకా.ఛక్రధర్ రావు(57),, జల్లా.శాంతరావు(54) సంఘటన స్థలంలో మరణించగా,,ASP కోకా.రామ్ ప్రసాద్(58)కి,,డ్రైవింగ్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ చర్ల.నరసింహరాజు(54)కు తీవ్రగాయాలు అయ్యాయి..డ్రైవర్ ప్రక్కన కుర్చున్న ASP రామ్ ప్రసాద్ సీటు బెల్ట్ పెట్టుకోవడంతో ప్రాణా ఆపాయం తప్పింది…వీరిద్దరికి ప్రాణపాయం లేదని ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి వైద్యులు తెలిపారు..పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

