చర్చి ప్రార్దనల్లో పాల్గొన్న టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబు సస్పెండ్-టీటీడీ
తిరుపతి: టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ.రాజశేఖర్ బాబును ఆయన ప్రవర్తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేయడం జరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు..తిరుపతి జిల్లా పుత్తూరులోని స్వగ్రామంలో రాజశేఖర్ బాబు ప్రతీ ఆదివారం స్థానిక చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారని సమాచారం అందిందని పేర్కొన్నారు.. ఈ వ్యవహారంతో టీటీడీ ఉద్యోగిగా ఆయన సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని భావించడమేకాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగి అయివుండి భాద్యతారహితంగా వ్యవహరించడం జరిగిందని తెలిపారు..ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయన్ను తక్షణమే సస్పెండ్ చేయడం జరిగిందని వెల్లడించారు.