అసంపూర్తిగా ముగిసిన ట్రంప్,పుతిన్ అలాస్కా సమావేశం
అమరావతి: ప్రగ్భాలు పలికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,,రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ముందు సాధు జంతువులా మారిపోయి మాట్లాడారు..తొలుత అలాస్కాలోని యాంకరేజ్‌కు చేరుకున్న ట్రంప్,,తరువాత అక్కడికి చేరుకున్న పుతిన్ కు ఘన స్వాగతం పలికారు..ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని పుతిన్ ఆపకపోతే అత్యంత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ ఇటీవలే తీవ్ర హెచ్చరికలు చేసిన విషయం విదితమే..అగ్రదేశాధిపతుల మధ్య దాదాపు 3 గంటల పాటు జరిగిన సమావేశం అసంపూర్తిగా ముగిసింది.. అనతరం మీడియా సమావేశంలో ఇరుదేశాధ్యక్షలు మాట్లాడారు.
చాలా అంశాలపై ఇద్దరి మధ్య అంగీకారినికి:- తమ సమావేశం ఫలప్రదమైందని,, సమావేశంలో అనేక అంశాలపై చర్చించామని తెలిపారు.. తమ చర్చల్లో ఎంతో పురోగతి సాధించమని,, అయితే కొన్ని సమస్యలను ఇంకా పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పారు.. తుది ఒప్పందం మాత్రం కుదరలేదని వెల్లడించారు..చాలా అంశాలపై ఇద్దరి మధ్య అంగీకారినికి వచ్చామని,, కొన్ని విషయాలు ఇంకా మిగిలే ఉన్నాయని వెల్లడించారు.. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా ఒప్పందంపై సంతకం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.. త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ,, ఈయూ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు.. రష్యా అధ్యక్షడు పుతిన్ తో త్వరలో మాస్కోలో సమావేశం అవుతానని ప్రకటించారు..
వివాదానికి ముగింపు పలకడానికి పునాది:- అలస్కాలో ట్రంప్‌తో సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందని రష్యావ్లాదిమిర్ పుతిన్ అన్నారు.. ఉక్రెయిన్ యుద్ధం ప్రధాన అంశంగా చర్చించామన్నారు.. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయతీగా ఉన్నానని,, ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి పునాది అని వెల్లడించారు..ఈ సందర్భంగా ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు.. ట్రంప్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు..ఇరుదేశాల మధ్య సంబంధాల విషయాలలో క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్‌తో మాస్కో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నదని చెప్పారు.. ఉక్రెయిన్‌పై ట్రంప్ , తాను ఒక అవగాహనకు వచ్చామన్నారు.. చర్చల పురోగతిని దెబ్బతీయవద్దని ఈయూని పుతిన్ హెచ్చరించారు.. 2022లో ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్‌తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ పునరుద్ఘాటించారు..తదుపరి సమావేశం కోసం ట్రంప్‌ను మాస్కోకు రావాల్సిందిగా ఆహ్వానించాని పుతిన్ తెలిపారు.