గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు-రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు సంబంధించి ముఖ్యమైన విషయంను రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటనలో తెలిపింది..గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మొత్తం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లోని నిబంధనలకు లోబడి పారదర్శకంగా చేపట్టడం జరుగుతుంది. బదిలీల్లో సచివాలయ కార్యదర్శుల అర్హతలను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. బదిలీలను మీకు అనుకూలంగా/ మీరు కోరిన చోట చేయిస్తామని చెప్పే మాటలను, వదంతులను, ఇతరత్రా మాటలను నమ్మవద్దు. కేవలం సచివాలయ కార్యదర్శుల అర్హతలు అనుసరించి నిబంధనల మేరకే బదిలీలు చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అపోహలను నమ్మి మోసపోవద్దని రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కోరారు.

