AP&TG

రాష్ట్రంలో IASల బదలీలు,నియామకాలు

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పాలనా వ్యవస్థను సమర్థవంతంగా నడిపించేందుకు 14 మంది ఐఏఎస్ అధికారులకు సంబంధించి బదిలీలు, పోస్టింగ్‌ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మార్పులు జిల్లాస్థాయి పరిపాలనా శాఖల్లో కీలక బాధ్యతలను పునర్విభజన చేసేలా ఉన్నాయి. బదిలీ, నియామకాలు ఇలా..

వివరాలు ఇలా వున్నాయి:-

పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా శ్రీవాస్ నుపుర్ అజయ్ కుమార్ నియామకం.

గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీ కల్పన కుమారిని బదిలీ చేసి ప్రకాశం జిల్లా జాయింట్ నియామకం.

విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ కతవాటె మయూర్ అశోక్ ను బదిలీ చేసి గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా నియామకం.

తిరుపతి జేసీ, తుడా వైఎస్ ఛైర్మన్‌గా ఆర్.గోవిందరావు నియామకం.

చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్ నియామకం.

అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా శివ్ నారాయణ్ శర్మ నియామకం.

తెనాలి సబ్ కలెక్టర్ వి.సంజనా సింహను బదిలీ చేసి పల్నాడు జిల్లా జేసీగా నియామకం.

కడప జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ను బదిలీ ఈ స్థానంలో జాయింట్ కలెక్టర్‌గా నిథి మీనా నియామకం..

ప్రస్తుతం అనంతపురం జేసీగా ఉన్న శివ్ నారాయణ శర్మను బదిలీ ఈ స్థానంలో జాయింట్ కలెక్టర్‌గా సి.విష్ణు చరణ్ నియామకం.

APTS MD మల్లవరపు సూర్యతేజను బదిలీ చేసి అనకాపల్లి జాయింట్ కలెక్టర్‌గా నియామకం.

వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ SS శోబికను బదిలీ చేసి గిరిజన్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ MDగా నియామకం.

చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిల్ల విద్యాధరిని బదిలీ చేసి విశాఖపట్నం జాయింట్ కలెక్టర్‌గా గొబ్బిళ్ళ, విద్యాధరి నియామకం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *