రాబోయే 4 రోజులు దక్షిణకోస్తా,రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు
అమరావతి: రాబోయే 4 రోజులు దక్షిణకోస్తా,రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు..
26వ తేది నాటికి అల్పపీడనం:- ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 26వ తేది నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.. ఇది సెప్టెంబర్ 27నాటికి వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.అదే రోజు ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని,,రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.