రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు,ఈదురుగాలులు
అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం 2, 3 రోజుల్లో రుతుపవనాలు మరిన్నిప్రాంతాలకు విస్తరించేందుకు దొహదపడుతుందని భారత వాతావరణశాఖ తెలిపింది.. ప్రస్తుతం అరేబియా సముంద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఈనెల 23 వరకు కొనసాగుతుందని,,అల్పపీడన ప్రభావంతో దక్షిణాదితో పాటు దేశంలో అనేక రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది.. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు,, గంటకు 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం వుందన్నారు..ముఖ్యంగా కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్,తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని ఐఎండీ తెలిపింది..

