AP&TGDEVOTIONALOTHERS

అత్యంత వైభవంగా శ్రీకాళహస్తీశ్వరుని రథోత్సవం

శ్రీకాళహస్తీ: శ్రీకాళహస్తీశ్వర స్వామి,అమ్మవారి రథోత్సవం సోమవారం అత్యంత వైభవంగా నభూతో నభవిష్యతి అన్నరీతిలో జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు. నాలుగు మాడవీధులు నిండిపోయాయి. రథాన్ని అలంకరించి స్వామి, అమ్మవార్లను వాటిపై ప్రతిష్టింపజేశారు. శాస్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ముందుకు కదిలాయి. వీధులు ఇసుక వేస్తే రాలనంతగా భక్తులతో కిటకిటలాడాయి. స్వామి రధాన్ని లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. హరహర మహాదేవ అనే నినాదాలు చేస్తూ భక్తుల పరమ పవిత్రమైన ఆయన రథాన్ని ముందుకు కదలిస్తూ భక్తిపార్వస్యంలో మునిగిపోయారు. వీధులలో కిక్కిరిసిన భక్తులు రథాలపై ఉప్పు మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు రథోత్సవం మూర్తులైన స్వామి అమ్మవాలను తిలకించి భక్తులు పులకరించిపోయారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *