ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూత
అమరావతి: ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు(83) కన్నుమూశారు..గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు..1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన కోటా 750కిపైగా చిత్రాల్లో నటించారు..తన నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాపం:- విలక్షణ నటుడు, మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకుడు కోటా శ్రీనివాస రావు పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.. సనాతన ధర్మం, సామాజిక విలువలు, భాషా పరిరక్షణ తదితర విషయలపై సమాజంలో మరి ముఖ్యంగా యువతలో చైతన్యం నింపేందుకు ఎంతో కృషి చేశారని తెలిపారు. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.వారి సేవలను గుర్తించి 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
పవన్ కళ్యాణ్:- పవన్ కళ్యాణ్ కోట శ్రీనివాసరావు పార్దివదేహంకు నివాళులు అర్పించారు..
కోట శ్రీనివాసరావు తొలి-తుది సినిమా:- ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ,,చిరంజీవితో ప్రాణం ఖరీదు తన తొలి సినిమా అని కోట శ్రీనివాసరావు చెప్పారు..అనుకోకుండా కోట.శ్రీనివాసరాడు ఒక రకంగా తన తుది సినిమా పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాలో రెండు రోజులు నటించాను,, ఒక చిన్న స్పెషల్ రోల్ కోసం మూవీ యూనిట్ నన్ను అడిగారు. నాకు ఓపిక లేకపోయినా పవన్ కళ్యాణ్ కోసం నటించాను అని తెలిపారు..తొలి సినిమా అన్న చిరంజీవితో,,తుది సినిమా తమ్ముడు పవన్ కళ్యాన్ తో నటన..ఇదే విధి అంటే…
తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్:- ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ప్రియాంక సంతాపం తెలిపారు..ఎన్నో మధురమైన పాత్రలు,విలన్ గా,ఆర్టిస్టుగా ఆయన పోషించిన పాత్రలు సినీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.