తెలంగాణ 2024 గద్దర్ సినిమా అవార్డులు
హైదరాబాద్: గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డుల పై నటి జయసుధ నేతృత్వంలో ఏర్పాటైన సినీ అవార్డుల జూరి కమిటీ, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దీల్ రాజు ఆధ్వర్యంలో అవార్డుల ఎంపిక వివరాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అందచేసింది..అనంతరం గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల వివరాలను అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ ప్రకటించారు..జూన్ 14న హైటెక్స్ లో అవార్డుల ప్రదానం వుంటుందని పేర్కొన్నారు..
ఉత్తమ చిత్రం-కల్కి 2898AD,,ఉత్తమ 2వ చిత్రం-పొట్టెల్,,ఉత్తమ 3వ చిత్రం-లక్కీ భాస్కర్,,ఉత్తమ నటుడు-అల్లు అర్జున్(పుష్ప 2),,ఉత్తమ నటి-నివేదా థామస్ (35 ఇది చిన్న కథ కాదు),,ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్(కల్కి),,నేషనల్ ఇంటిగ్రేషన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం-కమిటీ కుర్రోళ్ళు,,బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం-35 ఇది చిన్న కథ కాదు,,
ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ-రజాకార్..
స్పెషల్ జ్యూరీ అవార్డులు– బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్-యదు వంశీ(కమిటీ కుర్రోళ్ళు),,ఉత్తమ ప్రజాదరణ చిత్రం-ఆయ్,,బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్-SJ సూర్య(సరిపోదా శనివారం),,బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్-శరణ్య ప్రదీప్(అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్),,బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్-భీమ్స్ సిసిరోలియో(రజాకార్),,బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్-సిద్ శ్రీరామ్(ఊరుపేరు భైరవకోన-నిజమే చెబుతున్న సాంగ్),,బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్-శ్రేయ ఘోషల్(పుష్ప 2-సూసీకి సాంగ్),,బెస్ట్ కమెడియన్-సత్య, వెన్నెల కిషోర్(మత్తు వదలరా),,బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్-మాస్టర్ అరుణ్ దేవ్(35 ఇది చిన్నకథ కాదు) మాస్టర్ హారిక(మెర్సీ కిల్లింగ్),,బెస్ట్ స్టోరీ రైటర్-శివ పాలడుగు(మ్యూజిక్ షాప్ మూర్తి),,బెస్ట్ స్క్రీన్ ప్లే-వెంకీ అట్లూరి(లక్కీ భాస్కర్),,బెస్ట్ లిరిసిస్ట్-చంద్రబోస్(రాజు యాదవ్),,బెస్ట్ సినిమాటోగ్రాఫర్-విశ్వనాధ్ రెడ్డి(గామి),,బెస్ట్ ఎడిటర్-నవీన్ నూలి(లక్కీ భాస్కర్),,బెస్ట్ ఆడియోగ్రాఫర్-అరవింద్ మీనన్(గామి),,బెస్ట్ కొరియోగ్రాఫర్-గణేష్ మాస్టర్-దేవర- ఆయుధ పూజ సాంగ్,,బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్-అధినితిన్ జిహాని చౌదరి(కల్కి),,బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్-చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్),,బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్-నల్ల శీను(రజాకార్),,బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్-అర్చన రావు, అజయ్ కుమార్(కల్కి),,స్పెషల్ జ్యురి అవార్డు(హీరో)-దుల్కర్ సల్మాన్(లక్కీ భాస్కర్),,స్పెషల్ జ్యురి అవార్డు (హీరోయిన్) -అనన్య నాగళ్ళ (పొట్టెల్),,స్పెషల్ జ్యురి అవార్డు (డైరెక్టర్)-సుజీత్, సందీప్(క),,స్పెషల్ జ్యురి అవార్డు (నిర్మాత)- ప్రశాంతి రెడ్డి, రాజేష్ కళ్లేపల్లి(రాజు యాదవ్),,జ్యురి స్పెషల్ మెన్షన్ (సింగర్)-ఫారియా అబ్దుల్లా(ర్యాప్ సాంగ్- మత్తు వదలరా),,బెస్ట్ బుక్ ఆన్ సినిమా-మన సినిమా ఫస్ట్ రీల్(రెంటాల జయదేవ్).. అలాగే 2014-2023 మధ్య విడుదలైన చిత్రలకు సంబంధించిన అవార్డులను త్వరలో ప్రకటిస్తామన్న జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధ వెల్లడించారు.

