AP&TG

ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ను కలిసిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

తిరుపతి: తిరుమలకు విచ్చేసిన ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ కు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఘనంగా స్వాగతం పలికారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం సీపీ  రాధాకృష్ణన్ తిరుమలకు విచ్చేశారు. ఈ క్రమంలో రాధా కృష్ణన్ తో మంత్రి నారాయణ, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమావేశం అయ్యారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను రాధాకృష్ణన్ కి మంత్రి నారాయణ వివరించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *