AP&TGDEVOTIONALOTHERS

శ్రీశైలం.. శ్రీకాళహస్తిల్లో వైభవేతంగా మహాశివరాత్రి-నీలకంఠుని దర్శనంకు తరలిన భక్తులు..

అమరావతి: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఏర్పాట్ల నేపథ్యంలో స్వామివారు, అమ్మవార్ల దర్శనానికి ఏర్పాటుచేసిన క్యూ లైన్లను జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సక్రమంగా దర్శనం జరిగేలా అధికారులకు అవసరమైన సూచనలు ఇస్తున్న జిల్లా కలెక్టర్.ఈ సందర్భంగా కలెక్టర్ తో కలిసి జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్,క్యూ లైన్ల నిర్వహణ, భక్తులకు అందిస్తున్న తాగునీరు, భద్రతా-ఇతర సదుపాయాలను పరిశీలించారు.

శ్రీకాళహస్తి:- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ముక్కంటి క్షేత్రం ఆదివారం మహా శివరాత్రి పర్వదినాన భక్త జనసంద్రమైంది. సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడానికి విచ్చేశారు. పవిత్రమైన స్వర్ణముఖి నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *