శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్‌ఛార్జి కోటా.వినూతను పార్టీ నుంచి బహిష్కరణ
అమరావతి: శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్‌ఛార్జిగా వుంటున్న కోటా.వినూతను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన విడుదల చేసింది..జనసేన పార్టీ విధి విధానాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నందున, వినూతను గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడమైందని వెల్లడించారు.. ఆమెపై చెన్నైలోని హత్య కేసు ఆరోపణలు పార్టీ దృష్టికి వచ్చాయని, ఈ క్రమంలో వినూత కోట ను పార్టీ నుంచి బహిష్కరించడమైందని వేములపాటి అజయ్ కుమార్ జనసేనపార్టీ హెడ్-కాన్ఫిక్ట్ మేనేజ్మెంట్ పేరుపై ప్రకటన విడుదల చేశారు..నేపధ్యం…..చెన్నై మింట్ పోలీసు స్టేషన్ పరిధిలో మురికి నీరు పారుదల కాలువలో 3 రోజుల క్రితం ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు..అతని చేతి మీద జనసేన సింబల్ తో పాటు వినూత పేరు ఉండటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు..రాయుడును హత్య చేసి కాలువలో పడేసినట్లు నిర్ధారణ అయింది..ఈ క్రమంలో వినూత, ఆమె భర్తతోపాటు నిందితుల్లో శ్రీకాళహస్తికి చెందిన శివకుమార్, గోపి, దాసర్‌లను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. శ్రీకాళహస్తికి చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు,,జనసేన ఇన్‌ఛార్జి వినూత కోటా వద్ద వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్‌గా పనిచేశాడు..రెండు వారాల కిందటే రాయుడిని ఆమె విధుల నుంచి తొలగించారు.