రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్లు,సిబ్బంది బదిలీలు
అమరావతి: రాష్ట్రంలో పలు మునిసిపాలిటీలు,కార్పొరేషన్స్ లో మునిసిపాల్ కమిషనర్లు,సిబ్బందిని బదిలీలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుద చేసింది..రాయచోటి మున్సిపల్ కమిషనర్ N.వాసు బాబును, నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ TPROగా నియమించారు..రాయచోటి మున్సిపల్ కమిషనర్ గా G.రవి నియమించారు..శ్రీకాళ హస్తి మున్సిపల్ కమిషనర్ గా P.భవానీ ప్రసాద్ నియమించారు.. శ్రీకాకుళం అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ సెక్రటరీ గా L.సురేష్ నియామకం.. సాలూరు మున్సిపల్ కమిషనర్ గా T.T.రత్నకుమార్ నియామకం.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ సహాయ కమిషనర్ గా D.కొండయ్య నియామకం..కదిరి మున్సిపాలిటీ శానిటరీ ఇన్ స్పెక్టర్ B.ప్రహ్లాద్ ప్రమోషన్ పై కమలాపురం మున్సిపల్ కమిషనర్ గా,,మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ గా S.రవీంద్రబాబు నియమిస్తూ పురపాలక పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

