ప్రముఖ సీనియర్ నటి బీ.సరోజాదేవి కన్నుమూత
అమరావతి: తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సీనియర్ నటి బీ.సరోజాదేవి(87) కన్నుమూశారు.. ఆమె గత కొంతకాలంగా వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. బెంగళూరు, యశ్వంతపురలోని మణిపాల్ ఆస్పత్రిలో ఆమెకి చికిత్స తీసుకుంటున్నారు..వైద్యంకు శరీరం సహకరించక పోవడంతో సోమవారం ఉదయం 9 గంటలకు కన్నుమూశారు..ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు..కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు..సరోజాదేవి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో కలిపి మొత్తం 200లకి పైగా సినిమాలలో నటించారు..ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎమ్జీఆర్ వంటి హీరోలతో కలిసి నటించింది.. 1938 జనవరి 7, బెంగళూరులో జన్మించిన సరోజా దేవి తొలి సారి కన్నడ భాషలో మహాకవి కవి కాళిదాస అనే చిత్రం చేసింది..ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డ్ అందుకుంది..కేంద్ర ప్రభుత్వం ఆమెకి 1969లో పద్మ శ్రీ అవార్డ్ అందించింది..1992లో పద్మ భూషణ్‌తో సత్కరించింది.