డిప్యూటివ్ పోలీసు కమిషనర్ పై దొంగలు కత్తితో దాడికి యత్నం
హైదరాబాద్: తెలంగాణలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని రౌడీలు, దొంగలు దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ప్రమోద్ అనే పోలీసు కానిస్టేబుల్‌ను రౌడీషీటర్ హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేపింది. నేడు హైదరాబాద్ లోని ఈ ఘటన చాదర్‌ఘాట్‌లోని విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్ద ఇద్దరు సెల్‌ఫోన్ దొంగలు,, సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్‌పై కత్తితో దాడి చేసేందుకు యత్నించారు. కత్తి దాడిని అడ్డుకునేందుకు డీసీపీ గన్‌మెన్ ప్రయత్నించే సమయంలో జరిగిన తోపులాటతో గన్‌మెన్ కింద పడిపోయాడు. దొంగలు మళ్లీ డీసీపీపై దాడికి యత్నించగా,, గన్‌మెన్ వద్ద ఉన్న వెపన్‌ను తీసుకుని డీసీపీ చైతన్య దొంగలపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇద్దరిలో ఒక దొంగకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని నాంపల్లి ఆస్పత్రికి తరలించారు.ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

