ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బివి పట్టాభిరామ్ కన్నుమూత
అమరావతి: ప్రఖ్యాత హిప్నాటిస్ట్, సైకాలజిస్ట్,వ్యక్తిత్వవికాస నిపుణులు భావరాజు వేంకట పట్టాభిరామ్ (75) మంగళవారం ఖైరతాబాద్‌లోని స్వగృహంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు..తెలుగు యువత జీవితాలకు శాశ్వతమైన దిక్సూచిలా, తెలుగుజాతి గర్వించదగిన డాక్టర్ పట్టాభిరామ్ మరణంతో వ్యక్తిత్వ వికాస రంగంలో ఒక శూన్యం ఏర్పడిందని హరియాణా-చండీగఢ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు..డాక్టర్ పట్టాభిరామ్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియచేస్తూ,,వారి కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలంలో మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు..ఒక ఐంద్రజాలికుడుగా, విద్యార్థులకు, యువ కుటుంబాలకు వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా పట్టాభిరాం వివిధ రాష్ట్రాలకు చెందిన కొన్ని లక్షల మంది జీవితాలను నిలబెట్టారని వారి సేవలను బండారు దత్తాత్రేయ గుర్తుచేసుకున్నారు..వారి రాసిన ‘కష్టపడి చదవద్దు-ఇష్టపడి చదవండి’, ‘మైండ్ మేజిక్’, గుడ్ పేరెంట్’ వంటి డజన్లకొద్దీ పుస్తకాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు..