కాంగ్రెస్ పార్టీ, YSR కాంగ్రెస్ పార్టీ కాగానే రెడీ మేడ్ కేడర్, కమిటీలు వచ్చినట్టు-పవన్ కళ్యాణ్
పోలవరంకు పొట్టి శ్రీరాములు పేరు.?
అమరావతి: కాంగ్రెస్ పార్టీ, YSR కాంగ్రెస్ పార్టీ కాగానే రెడీ మేడ్ కేడర్, కమిటీలు వచ్చినట్టు జనసేనకు అలా కాదు అని,మన పంట మనమే కోసుకోవాలి,కమిటీలు వేయమంటే సమయం పడుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన పదవి- బాధ్యత సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు.పార్టీలో కష్టపడి పనిచేసిన వారిని పార్టీ గుర్తించి తగిన పదవులు ఇవ్వడం జరుగుతుందన్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి సరైన గుర్తింపు పోలవరం ప్రాజెక్టుకి ఆయన పేరు పెట్టడమే అని తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు.
