మంగళగిరి-కృష్ణ కెనాల్ మధ్య రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం తెలిపిన రైల్వేశాఖ
అంచనా వ్యయం రూ.112 కోట్లు..
అమరావతి: మంగళగిరి-కృష్ణ కెనాల్ స్టేషన్ల మధ్య E13 ఎక్స్ టెన్షన్ రోడ్డు వద్ద రూ.112 కోట్ల అంచనా వ్యయంతో 6 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదనను రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆమోదించినట్లు సమాచారం. ప్రతిపాదిత R.O.B అమరావతి రాజధాని-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నేషనల్ హైవే-16 మధ్య అనుసంధానించే రహదారిపై ఉంది. ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జోన్ ద్వారా 100 శాతం రైల్వే ఆర్దిక నిధులతో నిర్మాణం జరుగుతుంది.
కొత్తగా నిర్మితం కానున్న E13 ఎక్స్ టెన్షన్ రోడ్డు, NH16ను-రాజధాని అమరావతితో కలుపుతుంది. మధ్యలో ఒక వైపు రైల్వే ట్రాక్ ఉంటుంది. ఈ రైల్వే ట్రాక్ చెన్నై-హౌరాను విజయవాడ మీదుగా వెళ్లె రైల్వే లైన్ ను కలుపుతుంది. తొలుత దీనిని నాలుగు లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జి కోసం ప్రణాళిక చేశారు.అయితే భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్ ను పరిగణనలోకి తీసుకుని, 6 లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనకు అంగీకరించింది. టెండరింగ్ ప్రక్రియ ప్రారంభించే ముందు డిజైన్ల ఆమోదం, సాధారణ డ్రాయింగ్‌లు వంటి ప్రాథమిక పనులు త్వరలో పూర్తి కానున్నాయి. రోడ్డు ఓవర్ బ్రిడ్జి(R.O.B) పూర్తి అయితే రాజధాని అమరావతి ప్రాంతం వైపు వెళ్లే ట్రాఫిక్ సజావుగా సాగడానికి ఎంతో సహాయపడుతుంది.