గోవా గవర్నర్‌గా పూసపాటి.అశోక్‌గజపతిరాజు నియమకం
అమరావతి: రెండు రాష్ట్రాలకు,,ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపదీముర్ము నియమిస్తూ ఉతర్వర్వు జారీ చేశారు..కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి బ్రిగేడియర్ (డాక్టర్) బిడి మిశ్రా (రిటైర్డ్) రాజీనామాను అధ్యక్షుడు ముర్ము ఆమోదించారు..హర్యానా గవర్నర్‌గా ప్రొఫెసర్ అశిమ్ కుమార్ ఘోష్,, గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతిరాజు,,లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తా నియమితులయ్యారు..
గోవా గవర్నర్‌గా పిఎస్ శ్రీధరన్ పిళ్లై స్థానంలో టీడీపీ సినియర్ నాయకుడు,,కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి పూసపాటి.అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు.
జమ్మూలో జన్మించిన నాయకుడు:- బిజెపి సీనియర్ నాయకుడు-జమ్మూ కాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కవిందర్ గుప్తా లడఖ్ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు..గుప్తా పూర్వపు జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో పరిపాలనా అనుభవం వుంది.. కేంద్రపాలిత ప్రాంతంలో అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి జమ్మూలో జన్మించిన నాయకుడు..
విద్యావేత్త–రాజకీయాలను నిశితంగా ఆవగాహన చేసుకోగల వ్యక్తి ప్రొఫెసర్ అశిమ్ కుమార్ ఘోష్ హర్యానా గవర్నర్‌గా నియమితులయ్యారు..