త్వరంలో పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మాణం ప్రారంభం-రామ్ తాళ్ళూరి
అమరావతి: కొత్త సంవత్సరం మొదటి రోజున పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మాణం ప్రారంభించనున్నట్టు నిర్మాత రామ్ తాళ్ళూరి ప్రకటించారు. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామ్ తాళ్ళూరి, పవన్ కళ్యాణ్, ఆశీస్సులతో ‘జైత్రరామ మూవీస్’ పేరుతో కొత్త బ్యానర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ టీమ్ తో ఈ సినిమాను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఎప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళుతుంది, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలకు సంబంధించిన పూర్తి త్వరలోనే వెల్డించే అవకాశం ఉంది.రామ్ తాళ్లూరి, డైరెక్టర్ సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఈ సినిమాని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కొన్ని రోజులుగా తక్కువ హెయిర్ ఉన్న కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఇది ఈ సినిమా కోసమే అని అంతా భావిస్తున్నారు. మొత్తానికి డిప్యూటీ సీఎంగా ఎంత బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రకటించడంతో ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

