భారతదేశ ప్రతిష్టకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక చిహ్నం-డిప్యూటివ్ సీ.ఎం పవన్ కళ్యాణ్
అమరావతి: నేడు 75వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున, జనసేన పార్టీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జనసేన అధినతే,డిప్యూటివ్ సీ.ఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాన్ వీడియో విడుదల చేశారు. అయన మాట్లాడుతూ దేశ ప్రగతికి ఆయనొక వారధి, దేశ ప్రతిష్టకు ఆయనొక చిహ్నం, దేశ ప్రజల ధైర్యానికి ఆయనొక నమ్మకం, శత్రు దేశాల ముష్కర మూకలకు ఆయనొక సింహస్వప్నం, ప్రపంచదేశాల్లో భారతదేశానికి దక్కిన గౌరవానికి కారణం అని ఉద్ఘటించారు.