వాణిజ్యం, రక్షణ రంగ వృద్ధిపై ఫిజియన్ ప్రధానితో చర్చలు జరిపిన ప్రధాని మోదీ
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,, ఫిజి ప్రధాని సితివేని లిగమమడ రబుకాతో సోమవారం వివిధ అంశలపై చర్చలు జరిపారు..వాణిజ్యం, పెట్టుబడులు వంటి రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చలు జరిగినట్లు సమాచారం..మూడు రోజుల పర్యటన నిమిత్తం రబుకా ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు.. ఫిజియన్ ప్రధానితో పాటు ఆదేశ ఆరోగ్య మంత్రి రతు అటోనియో లాలబలావు,,అలాగే సీనియర్ అధికారులు ఈ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంలో ఉన్నారు..
రెండు దేశాలు బలమైన సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలను కలిగి ఉన్నాయి..1879లో బ్రిటిష్ వారు భారతీయ కార్మికులను ఒప్పందం కింద ఫిజికి తీసుకెళ్లినప్పుడు ఫిజితో భారతదేశ సంబంధాలు మొదలైయ్యాయి.. గత సంవత్సరం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిజి పర్యటన తరువాత రబుకా భారతదేశంలో పర్యటిస్తున్నారు.. ప్రధానమంత్రి రబుకా పర్యటన భారత్, ఫిజీ దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న శాశ్వత సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.. సముద్ర భద్రత రంగంలో ఫిజి భారతదేశానికి ఒక ముఖ్యమైన దేశం.. పసిఫిక్ ప్రాంతంలో తన వ్యూహాత్మక బలాన్ని విస్తరించడానికి చైనా అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తునన నేపథ్యంలో,, ఫిజితో తన రక్షణ సంబంధాలను విస్తరించుకోవాలని భారతదేశం చూస్తోంది.