కార్యకర్తల బీమా కోసం రూ.2 కోట్లను విరాళం-పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ..
అమరావతి: మహశివరాత్రి పర్వదిన సందర్బంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధినేత,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు.తొలి సభ్యత్వం తీసుకుని,కార్యకర్తల బీమా కోసం రూ.2 కోట్లను విరాళంగా అందించారు.ఇందుకు సంబంధించిన చెక్కును పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల.మనోహర్ కి అందచేశారు.5వ విడత క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 26 నుంచి మొదలు అవుతుందని,పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఒక వారం ముందు నుంచే ప్రారంభం అవుతుందని తెలిపారు.
పార్టీ శ్రేణులు మూడు రకాలు:- ఈ సందర్భంగా పార్టీ కోసం పనిచేసే వారిని “ఉద్యమి-సాధక్-ప్రదాత”లుగా వర్గీకరించి ఇక నుంచి ఈ రకంగా పిలుస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఉద్యమి:– పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని, సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేసేందుకు ముందుకొచ్చి పార్టీ సభ్యత్వం తీసుకునేవారు. సాధక్:– పార్టీ పోరాటానికి మరింత బలాన్ని చేకూర్చేలా కొత్తవారిని ప్రభావితం చేస్తూ, నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీలోకి ఆహ్వానిస్తూ, సభ్యత్వాలు చేయించేవారు. ప్రదాత:– పార్టీకి పరోక్షంగా ఆర్థిక, సాంకేతిక లేదా మేధోపరమైన సహకారం అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారు.

