AP&TGDEVOTIONALOTHERS

మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలం- టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి

తిరుమలలో నవంబర్ నెలలో విశేష పర్వదినాలు..

తిరుపతి: పూర్వం నుండి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచివెళ్లి స్వామివారి కృపకుపాత్రులయ్యారనిటిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి చెప్పారు. ఇలాంటి మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమన్నారు. దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శుక్రవారం తెల్లవారుజామున అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. తొలుత భాను ప్రకాష్డ్డి, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు కలిసి మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పూర్వం శ్రీపురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. 

 అంతకుముందు భజనమండళ్ల స‌భ్యులు అలిపిరి పాదాలమండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్లపూజ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి 3,500 మందికిపైగా భజనమండళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.

 

తిరుమలలో నవంబర్ నెలలో విశేష పర్వదినాలు:-

  • నవంబర్ 1న ప్రబోధనైకాదశి, పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
  • నవంబర్ 2న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస దీక్ష సమాప్తి.
  • నవంబర్ 5న కార్తీక పౌర్ణమి గరుడ సేవ.
  • నవంబర్ 9న కార్తీక వన భోజనం.
  • నవంబర్ 15న సర్వ ఏకాదశి.
  • నవంబర్ 17న ధన్వంతరి జయంతి.
  • నవంబర్ 18న మాస శివరాత్రి.
  • నవంబర్ 25న తిరుమంగైయాళ్వార్ ఉత్సవారంభం.
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *