4.5 ఎకరాల భూమికి భూ సేకరణకు నోటీసులు-మంత్రి నారాయణ
7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్..
అమరావతి: రాజధాని ప్రాంతంలోని యండ్రాయి, వడ్డమాను గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ పై బుధవారం నుంచి గ్రామసభలు నిర్వహించనున్నామని మంత్రి నారాయణ తెలిపారు. 57వ సీఆర్డీఏ అథారిటీ సమావేశ వివరాలను మంత్రి నారాయణ సచివాలయంలోని ప్రచార విభాగంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధాని అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ గ్రామసభలు నిర్వహించనున్నామన్నారు.
వాస్తు ప్రకారం వీధి శూల ఉన్న 112 కమర్షియల్ ప్లాట్స్ కి వెస్ట్ సౌత్ వెస్ట్, సౌత్ సౌత్ వెస్ట్ కి రోడ్డు తగులుతున్నాయో మార్చుకునే వెసులుబాటు పై అథారిటీలో యాక్సెప్ట్ చేసిందన్నారు. ఒకవేళ ప్లాట్ అలాట్ అయిన లబ్ధిదారుడు మరోకరికి ఆ ప్లాట్ ను అమ్మకం చేస్తే వారికి ఈ ప్లాట్ లు మార్చుకునే అవకాశం ఉండదన్నారు.
సీడ్ యాక్సిస్ రోడ్ మార్గంలో మంగళగిరి రోడ్ కు కనెక్టవిటీకి మధ్యలో 4.5 ఎకరాల భూమి ఇప్పటి వరకు ల్యాండ్ పూలింగ్ కు ఆయా రైతులు ఇవ్వలేదని మంత్రి నారాయణ తెలిపారు. ఫిబ్రవరి లోపు స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని, కావున సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం వేగవంతం చేయడంలో భాగంగా ఆ 4.5 ఎకరాల భూమికి భూ సేకరణకు నోటీసులు ఇవ్వనున్నామని వివరించారు. నిబంధనల మేరకు ఆ భూమిని ప్రభుత్వం తీసుకునేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

