“నిసార్” ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
అమరావతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూపరిశీలనా ఉపగ్రహం “నిసార్” విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.. నేటి (బుధవారం) సాయంత్రం 5-40 నిమిషాలకు శ్రీహరికోట నుంచి 2,392 కిలోల బరువున్న నిసార్ శాటిలైట్ ను GSLV-F16 రాకెట్ ద్వారా ప్రయోగించారు.. GSLV-F16 రాకెట్ నిసార్ ఉపగ్రహాన్ని 740 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య అనువర్తిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ శాటిలైట్ గురించి పూర్తి సమాచారం క్రింద లింక్ ద్వారా చూడవచ్చు.

