AP&TG

అమరావతి ఔటర్ రింగ్ రోడ్ పనులు ప్రారంభించిన NHAI

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో ముఖ్యమైన అడుగు పడింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ORR) ప్రాజెక్టుకు సంబంధించి మొదటి గెజిట్ నోటిఫికేషన్ NHAI జారీ చేసింది. ఈ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా 9 గ్రామాల్లో మొత్తం 1,173 ఎకరాల భూమి సేకరిస్తారు. భూసేకరణకు సంబంధించి రెవెన్యూ అధికారుల బృందాలను ఏర్పాటు చేశారు. భూమి సేకరణ విషయంలో రైతులకు మంచి రక్షణ ఇవ్వడానికి భూసేకరణ చట్టం 2013 ప్రకారం చట్టబద్ధమైన పరిహారం అందించనున్నారు.

121 గ్రామాలు:- లింగాపురం, ధరణికోట, ముస్సాపురం, పాటిబండ్ల, జలాల్ పురం, కంభంపాడు, తల్లూరు, లింగంగుంట్ల, బలుసుపాడు వంటి గ్రామాల్లో ప్రస్తుతానికి భూసేకరణ జరుగుతోంది. తర్వాత, గుంటూరు, కృష్ణ, ఎన్‌టీఆర్ జిల్లాల్లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల చివరికి ఐదు జిల్లాల్లో గెజిట్ నోటిఫికేషన్‌లు జారీ చేయనున్నారు. మొత్తం ప్రాజెక్టులో 121 గ్రామాలు, 23 మండలాలు ప్రభావితమవుతాయి.

మొత్తం ఖర్చు 24,791 కోట్లు:- అమరావతి ORR ప్రాజెక్టు 189.4 కిలోమీటర్ల పొడవుతో, 6 లేన్లతో ప్రతి వైపు సర్వీస్ రోడ్‌లతో నిర్మిస్తారు. మొత్తం వెడల్పు 140-150 మీటర్లు. ఈ రోడ్డు విజయవాడ-గుంటూరు-తెనాలి అర్బన్ క్లస్టర్‌తో,, 5 జిల్లాలను అనుసంధానం చేస్తుంది. మొత్తం ఖర్చు సుమారు 24,791 కోట్లుగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్టును ‘గ్రీన్ హైవే’గా అభివృద్ధి చేస్తారు. ప్రాజెక్టు 12 ప్యాకేజీలుగా విభజించారు.NHAIనే పూర్తి చేస్తుంది.2015లో ప్రతిపాదించిబన ఈ ప్రాజెక్టు 2019 తర్వాత ఆగిపోయింది. ప్రస్తుతం వేగంగా ముందుకు సాగుతోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *