సెప్టెంబర్ 14,15వ తేదీల్లో జాతీయ మహిళా సాధికారిత సదస్సు-స్పీకర్ అయ్యన్న
దేశం మొత్తం మీద 31 అసెంబ్లీలు..
తిరుపతి,: సెప్టెంబర్ 14, 15 వ తేదీలలో తిరుపతి జిల్లాలో జరిగే జాతీయ మహిళా సాధికారిత కు సంభందించిన కాన్ఫరెన్స్ ను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.బుదవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ దేశం మొత్తం మీద 31 అసెంబ్లీలు ఉన్నాయని,, ప్రతి అసెంబ్లీలో కూడా వివిధ రకాల కమిటీలు ఉంటాయన్నారు..పార్లమెంటు స్పీకర్ నూతన ఒరవడి తీసుకుని రావడం జరిగిందని,,ఈ కమిటీలలో మహిళా కమిటీలు కూడా ఉంటాయని,,ఈ కమిటీల ద్వారా అనేక సమస్యలపై చర్చలు జరుగుతుంటాయన్నారు.
అసెంబ్లీలో 60 రోజులు చర్చలు జరిగేలా:- అసెంబ్లీలో వారం రోజులు పాటు చర్చలు కాకుండా సంవత్సరానికి 60 రోజులు చర్చలు జరిగేలా జరగాలని,, 60 రోజులు కూడా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం జరిగేలా ఉండాలని లోకసభ స్పీకర్ తెలిపారు అన్నారు. సెప్టెంబర్ 14, 15 తేదీలలో మహిళా సాధికారత సమావేశంలో ప్రతి రాష్ట్రాన్ని ఆరు మంది సభ్యులు హాజరు కావడం జరుగుతుందని,,వీరందరూ రెండు రోజులు వారి సమస్యల మీద చర్చించి పంపించే రిపోర్టులపై పార్లమెంట్, అసెంబ్లీల్లో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
రాఘరామ కృష్ణరాజు మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధానులు మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్నారు. మహిళా సాధికారత కమిటీలు పార్లమెంట్ లో 31 మంది ఉంటారని అలాగే ఒక రాష్ట్రానికి 6 మంది వరకు కమిటీ మెంబర్లు ఉంటారని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తిరుపతి జిల్లా 34 మండలాలు 7 మున్సిపాలిటీలు, నాలుగు రెవెన్యూ డివిజన్ల కలిగి ఉందని స్పీకర్ కు తెలియజేశారు. జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ కు సంభందించిన ఆజెండ్ ను సంబంధిత అధికారులతో కలిసి తయారు చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

