లెక్టరర్ అవమానించడంతో ఆత్మహత్య చేసుకున్న నారాయణ కాలేజీ విద్యార్ది?
అమరావతి: నారాయణ కాలేజీలో వేధింపులు తాళలేక మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నరని విద్యార్ది సంఘ నాయకులు ఆరోపించారు..విజయవాడ భవానిపురంలోని నారాయణ కాలేజీలో చదువుతున్న జీవన్ సాయి అనే విద్యార్దిని మార్కులు తక్కువ వచ్చాయని, లెక్టరర్ అందరి ముందు తిట్టడంతో అవమానం భరించలేక ఇంటికి వెళ్లి ఉరి వేసుకుని మరణించాడని విద్యార్ది సంఘ నాయకులు ఆరోపించారు..తన బిడ్డ మరణానికి నారాయణ కాలేజీ యాజమన్యమే కారణమని,,అందరి ముందు కొట్టడడంతో మనస్తాపనికి గురై ఆత్మహత్య చేసుకున్నడని జీవన్ సాయి తల్లి శిరిష విలపించారు..విద్యార్ది మరణ వార్త తెలిసిన భవాని పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్దు చేస్తున్నారు..జీవన్ సాయి ఆత్మహత్యపై నిరసన తెలిపేందుకు నారాయణ కాలేజీ వద్దకి వెళ్లిన విద్యార్ది సంఘ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.