AP&TGDEVOTIONALOTHERS

టీటీడీలో 1000 మందికి పైగా వున్నఅన్యమతస్థులను వెంటనే తొలగించాలి-బండి సంజయ్

అమరావతి: టీటీడీలో 1000 మందికి పైగా అన్యమతస్థులు పని చేస్తున్నారని,, హిందూ సనాతన ధర్మంపై విశ్వాసం లేని అన్యమత ఉద్యోగులు టీటీడీలో ఎందుకు పని చేస్తున్నరని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు..శుక్రవారం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని బండి సంజయ్ ,,తన పుట్టిన రోజు సందర్బంగా దర్శించుకున్నారు.. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి ఆలయ అర్చకులు స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు..దర్శనానంతరం కేంద్రమంత్రి సంజయ్, మీడియాతో మాట్లాడుతూ,, టీటీడీ పాలకమండలి తక్షణమే స్పందించి వారందరినీ తొలగించాలని డిమాండ్ చేశారు..ఇటీవల AEO స్థాయి ఉద్యోగిని తొలగించడంపై స్పందించిన కేంద్రమంత్రి,, ఒకరిని తొలగిస్తే సరిపోదని, టీటీడీలోని అన్యమత ఉద్యోగస్థులందరినీ గుర్తించి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు..అన్యమస్థులను తొలగించడంలో టీటీడీ ఎందుకు తాత్సర్యం చేస్తుందొ అర్ధకావడం లేదన్నారు..శ్రీవారి సేవలో నిజమైన భక్తి, నిబద్ధతతో పనిచేసే వారికే అవకాశం కల్పించాలని కేంద్రమంత్రి, టీటీడీ బోర్టును కోరారు..అలాగే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఇల్లెందు రామాలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి, వేములవాడ ఆలయాల అభివృద్ధికి టీటీడీ సహకారం అందించాలని కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *