తీవ్రం తుఫాన్ గా మారిన “మొంథా”-గంటకు 17 కి.మీ వేగంతో
బుధవారం కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు..
అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన “మోంథా”తుఫాను గత 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలి, తీవ్ర తుఫానుగా బలపడి, మంగళవారం (అక్టోబర్ 28) ఉదయం 0530 గంటలకు మచిలీపట్నంకి ఆగ్నేయంగా 190 కి.మీ దూరములో, కాకినాడకి ఆగ్నేయంగా 270 కి.మీ.దూరములో, విశాఖపట్నంకి ఆగ్నేయంగా 340 కి.మీ.,దూరంలో గోపాల్‌పూర్ (ఒడిశా) కి ఆగ్నేయంగా 550 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, మంగళవారం సాయంత్రం/రాత్రి సమయంలో మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని దాటే అవకాశం ఉంది, తీరము దాటే సమయములో బలమైన గాలులు గరిష్టంగా గంటకు 90-100 కి.మీ వేగంతో గరిష్టంగా 110 కి.మీ వేగంతో వీస్తాయి.
అతి భారీ వర్షపాతం:- తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణ, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలు అలాగే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లలో అత్యంత భారీ వర్షపాతం నుంచి ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షంపాతం నమోదయ్యే అవకాశముంది. మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశముంది.
బుధవారం:- గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం-విజయనగరం అనేక ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముంది. మిగిలిన ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని,, ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎం.డీ ప్రఖర్ జైన్ సూచించారు.

