రామప్పలయం సందర్శించిన ప్రపంచ సుందరిమణులు
హైదరాబాద్: ములుగు జిల్లా రామప్ప ఆలయానికి ప్రపంచ సుందరిమణులు చేరుకున్నారు..ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర ఎస్పీ శబరిష జిల్లా అధికారులా టూరిజం శాఖ అధికారులు ప్రపంచ సుందరి మహిళలకు ఘన స్వాగతం పలికారు. గుస్సాడీ నృత్య ప్రదర్శన ఒగ్గుడోలు ప్రదర్శన ద్వారా కళాకారులు స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలోకి చేరుకున్న సుందరిమణులు ఎవరికి వారే పూజలు చేసేందుకు ఆలయంలోకి వెళ్లారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు సిబ్బంది, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత చరిత్ర ఆలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పురాతన ఆలయం రామప్ప ఆలయాన్ని తిలకించి మంత్రముగ్ధులయ్యారు.