రాజధాని అమరావతి మునిగిందంటూ దుష్ప్రచారం-మంత్రి నారాయణ
అమరావతి: నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల టైప్-1,టైప్-2 ఇళ్లను పరిశీలించిన మంత్రి నారాయణ అదివారం పర్యటించారు.పనుల పురోగతిపై CRDAఇంజినీర్లు,కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతిలో గెజిటెడ్,గ్రూప్-డి అధికారుల కోసం మొత్తం 14 టవర్స్ లో 1440 ఇళ్లు,,టైప్-1 లో 384 ఇళ్లు,,,టైప్-2లో 336 ఇళ్లు,,గ్రూప్-డి అధికారుల కోసం 720 ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు..
IAS అధికారుల టవర్ల నిర్మాణం:- డిసెంబర్ 31 లోగా అన్ని టవర్లను పూర్తిచేసేందుకు రోడ్లు,డ్రెయిన్లు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు..ఫిబ్రవరి 1వ తేది నాటికి నిర్మాణం పూర్తి చేసి అధికారులకు అప్పగిస్తాం అన్నారు..IAS అధికారుల టవర్ల నిర్మాణం దాదాపు పూర్తయిందని వెల్లడించారు..మొత్తం 4400 ఇళ్లలో 3750 ఇళ్లను వచ్చే మార్చి నాటికి అధికారులకు,ఉద్యోగులకు అప్పగిస్తామని తెలిపారు..ట్రంక్ రోడ్లు ఏడాదిలో,,లే అవుట్ రోడ్లు రెండున్నరేళ్లలో,,ఐకానిక్ టవర్లను మూడేళ్లలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు..
రాజధాని అమరావతిపై దుష్ప్రచారం:- అమరావతి గురించి ఏసీ రూములో కూర్చుని కొంతమంది ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. అమరావతి మునిగిపోయిందనీ దుష్ప్రచారం చేస్తున్నారని అయితే రాజధాని అమరావతి గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే చీకొడతారని తెలిపారు..అమరావతిలో మిగిలిన కొద్ది భూములను భూసేకరణ ద్వారా తీసుకునేందుకు అధారిటీ ఆమోదించిందని,,భూసేకరణ కంటే భూసమీకరణ వల్ల రైతులకు ఎక్కువ లాభం వుంటుందని అన్నారు.