AP&TGDEVOTIONALOTHERS

శ్రీకాళహస్తిశ్వురీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం

శ్రీకాళహస్తి: మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం శ్రీకాళహస్తి స్వామివారిని దర్శించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి సమర్పించారు.దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో మంత్రి ఆనంకు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితుల నుంచి వేద ఆశీర్వచనం మంత్రి ఆనం అందుకున్నారు. మంత్రి ఆనంతో పాటు పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఆలయ ఈవో బాపిరెడ్డి, చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *