ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్ లో మెగాస్టార్ చిరంజీవి
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత క్షణం తీరిక లేకుండా పాలన పరమైన కార్యక్రమాల్లో బిజీగా వున్నారు..ఎన్నికల ముందు ఆయన కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ పూర్తి చేసేందుకు అవకాశం దొరికినప్పుడల్లా పాల్గొంటున్నారు.. పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాల్లో హరిహరవీరమల్లు,,ఓజీ,, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు వరుసలో ఉన్నాయి.. వీటిలో హరిహరవీరమల్లు సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది..
సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ కూడా జెట్ స్పీడ్ తో జరుగుతుంది.. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది..ఓజీ సినిమాలో పవన్ లుక్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకేత్తిస్తొంది..ఓజీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్,,ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు..గతంలో పవన్ కళ్యాన్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసిన దర్శకుడు హరీష్ శంకర్,, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం అయ్యింది..
మెగా స్టార్ చిరంజీవి ఈ సినిమా సెట్స్ కు వచ్చి సర్ప్రైజ్ విజిట్ ఇచ్చారు.. ఇందులో చిరు షూటింగ్ సీన్‌ను చూస్తుండగా, పవన్ కల్యాణ్ పక్కనే ఉన్నారు..చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా శ్రీలీల నటిస్తుంది..అలాగే ఉస్తాద్ భగత్‌సింగ్ లో సాక్షి వైద్య,,అశుతోష్ రానా,,గౌతమి,, నాగ మహేష్,,టెంపర్ వంశీ,, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ తదితరులు నటిస్తున్నారు..పలుమార్లు వాయిదా పడిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా షూటింగ్, ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.. ఈ షెడ్యూల్లో పవన్ కల్యాణ్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు..మెగా బ్రదర్స్ అంటూ కామెంట్లు పెడుతున్న అభిమానులు త్వరగా సినిమా అప్డేట్స్ కావాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.