తిరుమల స్వామివారిని దర్శించుకున్న మారిషస్ ప్రధానమంత్రి దంపతులు
తిరుపతి: భారతదేశంలో పర్యటనలో భాగంగా మారిషస్ ప్రధానమంత్రి దంపతులు సోమవారం తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుగు పయనైన మార్షస్ ప్రధానమంత్రి దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున జ్ఞాపికను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అందజేశారు.వీడ్కోలు కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి కలెక్టర్ శుభం బన్సల్,,ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.