కోనసీమ జిల్లాలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు-6 మంది మృతి
అమరావతి: కోనసీమ జిల్లాలోని రాయవరం మండలం వెదురుపాక వద్ద బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది.. పేలుడు దాటికి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి..ఈ ప్రమాదంలో 6 మంది సజీవ దహనం అయ్యారు. కొందరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేసి,, సహాయక చర్యలు చేపట్టారు..బాణాసంచా తయారీ కేంద్రంను కుమ్మరిపాలెం గ్రామానికి చెందిన సత్తిబాబు గత 40 సంవత్సరాల నుంచి బాణాసంచా తయారీ వ్యాపారంలో నిర్వహిస్తున్నాడు.. బాణాసంచా తయారీ కేంద్రంలోని అగ్నిప్రమాదం ఘటనలో 6 మంది సజీవ దహనం కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలు, వైద్యం సాయంపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి.. స్వయంగా సంఘటన స్థలికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని,, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు..ఈ విషయమై జిల్లా కలెక్టర్ మహేశ్‌కుమార్ మాట్లాడుతూ వారం క్రితమే బాణసంచా తయారీ కేంద్రాన్ని స్థానిక పోలీసులు,, రెవెన్యూ సిబ్బంది పరిశీలించి అన్ని రక్షణ చర్యలు ఉన్నట్లు నివేదిక ఇచ్చినట్లు ఆయన తెలిపారు..ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమచారం..ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.