పోలీసుల ఎదుటు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ,మల్లా రాజిరెడ్డిలు
హైదరాబాద్: మావోయిస్టుల పార్టీని దేశం నుంచి పూర్తిగా తూడిచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ తుది గడవు మార్చి31…నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ఎస్ఐబీ ఎదుట మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ అలియాస్ తిప్పిరి.తిరుపతి, మల్లా రాజిరెడ్డితో సహా 16 మంది, ఆదివారం ఆసిఫాబాద్ అడవుల్లో తెలంగాణ ఎస్ఐబీ ఎదుట వీరంతా లొంగిపోయారు. దేవ్ జీ కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీగా, రాజిరెడ్డి మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు.త్వరలోనే లొంగిపోయిన మావోయిస్టులను పోలీసులు మీడియా ఎదుట హాజరుపర్చే అవకాశం.

