మంగళవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం,భారీ వర్షాలకు ఆస్కారం
అమరావతి: మంగళవారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపధ్యంలో ఆ రోజున భారీ వర్షాలకు ఆస్కారం ఉందని ఉద్యానవన రైతులు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది.. శనివారం అల్లూరి, మన్యం,తూర్పుగోదావరి, కోనసీమ,కాకినాడ,ఏలూరు జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.. అనకాపల్లి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది..శుక్రవారం శ్రీకాకుళం జిల్లా అరకబద్రలో 43.7మిమీ,శ్రీసత్యసాయి జిల్లా కల్లుకుంటలో 30.7మిమీ వర్షపాతం నమోదు.తిరుపతి జిల్లా గంగుడుపల్లిలో 39.8 °C గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు అయిందని పేర్కొంది.

