నిరవధికంగా వాయిదా పడిన శాసనసభ సమావేశాలు
అమరావతి: శాసనసభ సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగేందుకు సహకరించిన అందరికీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కృతజ్ఞతలు తెలిపారు.16వ శాసనసభ సమావేశాలు 15 రోజుల పాటు జరిగాయని, 72 గంటల 14 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయని తెలిపారు. మొత్తం 122 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని, 80 ప్రశ్నలకు సభాసమక్షంలో ఉంచారని చెప్పారు. ఈసారి సమావేశాల్లో 18 బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు. శాసనసభలో టీడీపీ-135, జనసేన-21, వైసీపీ-11, బీజేపీ-8 మంది సభ్యులున్నారని స్పీకర్ తెలిపారు.

