డీజిపీ ఎదుట లోంగిపోయిన మావోయిస్ట్ పార్టీ కీలక నేతలు
హైదాబాద్: మావోయిస్టు రాష్ట్ర మాజీ కమిటీ సభ్యుడు, సింగరేణి కార్మిక సమాఖ్య బాధ్యుడు బండి ప్రకాశ్ @ ప్రభాత్ అలాగే మావోయిస్టు కేంద్ర కమిటీ మెంబర్ పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ శంకరన్న మంగళవారం ఉదయం DGP శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ప్రకాశ్ గత45 సంవత్సరాలుగా సిపిఐ మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. ప్రస్తుతం నేషనల్ పార్క్ ఏరియా అత్యంత కీలక ఆర్గనైజర్‌గా పనిచేస్తున్నారు. ప్రభాత్ అనే పేరుతో మీడియా టీమ్ ఇన్‌చార్జిగా పనిచేశారు.పుల్లూరి ప్రసాద్ రావుపై రూ.25 లక్షల రివార్డు అలాగే బండి ప్రకాశ్ పై రూ.20 లక్షల రివార్డు ఉంది.

