కాంతారం చాప్టర్ 1 నటుడు రాకేష్ పూజారి మృతి
అమరావతి: కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది..కాంతారం చాప్టర్ 1 సినీమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది..ఇందులో నటించిన రాకేష్ పూజారి(33) గుండెపోటుతో మరణించాడు..సోమవారం ఉడిపిలో జరిగిన ఓ పెళ్లి కార్యక్రమంలో రాకేష్,,మిత్రులతో కలిసి సందడి చేశాడు.. వారితో మాట్లాడుతూ ఉండగానే అతడికి గుండె పోటు వచ్చింది..అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో, స్నేహితులు రాకేష్‌ను వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు..రాకేష్‌ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారు..కార్డియాక్ అరెస్ట్ కారణంగా అతడు చనిపోయినట్లు సమాచారం..రాకేష్ మరణంపై కర్కాలా టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో,,వారు అసహజ మరణం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు..రాకేష్ మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు చిత్ర ప్రముఖులు రాకేష్ మరణంపై తమ సంతాపం తెలియచేస్తున్నారు..