AP&TGPOLITICS

తెలంగాణ మునిసిపాల్ ఎన్నికల్లో జనసేన పోటీ సిద్దం-ప్రధాన కార్యదర్శి

హైదరాబాద్: తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయించిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి.రామ్ ఒక  ప్రకటనలో తెలిపారు.తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపాల్ ఎన్నికలకు,ఎన్నికల సంఘ శనివారం ఎన్నికల షెడ్యూల్ విడదల చేయడాన్ని స్వాగతిస్తూన్నమన్నారు.ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ప్రతీ జనసైనికుడు, వీరమహిళ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలి అని కోరారు. పార్టీ తరపున త్వరలో ఎన్నికల కార్యాచరణ ప్రకటన చేస్తామన్నారు. సాధ్యమైనన్ని స్థానాల్లో జనసేన పార్టీ అబ్యర్దులు బరిలోకి దిగనున్నరని వెల్లడించారు.పార్టీ అధ్యక్షడు పవన్ కళ్యాణ్ భావజాలాన్ని, ఆలోచనలను,ఆశయాలను తెలంగాణ ప్రాంతం పట్ల జనసేనానికి ఉన్న అనుబంధాన్ని ప్రజలకు చేరవేయడం,తద్వారా తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *