AP&TGDEVOTIONALOTHERS

చంద్ర గ్రహణం కారణంగా మార్చి 1, 2వ తేదీల్లో SSD టోకెన్ల జారీ రద్దు-టీటీడీ

తిరుమల: ఇదివరకే టీటీడీ ప్రకటించిన విధంగా మార్చి 3వ తేదిన చంద్ర గ్రహణం కారణంగా మార్చి 2, 3వ తేదీలలో శ్రీవారి దర్శనాలకు సంబంధించి తిరుపతిలో జారీ చేసే స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయడం జరగదని టీటీడీ అధికారులు తెలిపారు.మార్చి 2, 3వ తేదీలకు సంబంధించిన ‌SSD టోకెన్లు ముందురోజు అనగా మార్చి 1, 2వ తేదీల్లో జారీ చేయబడవని,,మరలా మార్చి 4వ తేది దర్శనానికి సంబంధించిన SSD టోకెన్లను మార్చి 3వ తేదిన జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా మార్చి 3వ తేది వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేయడమైనదని,,ఈ కారణంగా మార్చి 2వ తేదిన వీఐపీ దర్శన సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారు.ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *