విజయవాడ- సింగపూర్ మధ్య ఇండిగో నూతన విమాన సర్వీస్-కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
అమరావతి: విజయవాడ నుండి సింగపూర్ లోని ఛాంగీ విమానాశ్రయాల మధ్య నేరుగా వారానికి మూడు సార్లు ఇండిగో విమాన సర్వీసు స్థానికులకు సేవలందించనున్నదని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.ఈ నవంబర్ 15 నుంచి విజయవాడ నుంచి మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసు అందుబాటు వుంటుందని పేర్కొన్నారు. విజయవాడ నుంచి మల్టిపుల్ టైమింగ్స్ తో ప్రయోజనం పొందేలా ఇండిగో సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో విజయవాడ అభివృద్ధి సాధించేందుకు ఈ విమాన సర్వీసు దోహదపడుతుందని, రాబోయే రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ రూట్లు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు.