భారీ వర్షానికి విలవిలలాడుతున్న హైదరాబాద్- గడిచిన 30 ఏళ్లలో మూసీకి..
సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా:-
హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురిసిన… నగరంలో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుని పోయాయి.. మూసీ పొంగి MGBSను వరద ముంచెత్తింది.. మూసారాంబాగ్, చాదర్‌ఘాట్ లోయర్ బ్రిడ్జిల పై నుంచి వరద నీరు ప్రవాహిస్తొంది.. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో వరద పెరిగి,,MGBS బస్టాండ్‌కు వెళ్లే రెండు బ్రిడ్జిలు నీట మునిగి పోవడంతో,,ప్రయాణికులను అధికారులు సురక్షితంగా బయటకుతీసుకుని వచ్చారు.. MGBSకు వచ్చే బస్సులను అధికారులు మళ్లించారు..పలు బస్సులను సికింద్రబాద్ JBS వరకే అనుమతి ఇచ్చారు..
గడిచిన 30 ఏళ్లలో మూసీకి:- మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్ బ్రిడ్జి వద్ద మూసీ ఏకంగా 13 అడుగుల ఎత్తుతో పొంగిపొర్లుతోంది.. గడిచిన 30 ఏళ్లలో మూసీకి ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. మూసీ వరద తాకిడికి పలు ప్రాంతాల్లో దేవాలయాలు మునిగిపోయాయి. పురానాపూల్ దగ్గర ఓ శివాలయంలో పూజారి కుటుంబం చిక్కుకుంది. వాళ్లు తమను ఆదుకోవాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైడ్రా, GHMC సిబ్బంది వారికి అల్పాహారం అందించారు. వారిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
మూసారాంబాగ్పాత వంతెనపై 10 అడుగుల:- మరోవైపు మూసారాంబాగ్వద్ద మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.. దాంతో అంబర్‌పేట్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే ప్రధాన రహదారిని అధికారులు మూసేశారు.. మూసారాంబాగ్పాత వంతెనపై 10 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది.. నిర్మాణంలో ఉన్న వంతెనను కూడా తాకుతూ వరద ప్రవాహం కొనసాగుతోంది..దింతో వరద నీటిలో కొత్త వంతెన నిర్మాణ సామాగ్రి కొట్టుకుపోయింది.
సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా:- భారీ వర్షాలపై అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మూసీ ఉధృతిపై సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.. హైడ్రా, GHMC, పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు.. మూసీ వరద ఉధృతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, ముంపు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు..

