GROUP-1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేసిన హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ GROUP-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరిస్తూ,,ఇప్పటివరకు ప్రకటించిన GROUP-1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ అదేశాలు ఇచ్చింది.. పరీక్షల పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని,,రీవాల్యుయేషన్ చేసిన తరువాత వాటి ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని TGPSC కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.. ఒకవేళ ఈ పద్దతిలో సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది..గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేసింది..అలాగే 8 నెలల్లో నిర్వహణ పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది..హైకోర్టు తాజా తీర్పుతో ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిన అభ్యర్థులు మళ్లీ తొలి నుంచి పరీక్షలకు సిద్దం కావాల్సిందే.