శుక్ర,శనివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం-వాతావరణ శాఖ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని,,శుక్ర శనివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది..ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్ద కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది అని తెలిపింది..కోస్తా జిల్లాల్లో ఐదు రోజుల పాటు బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది..అల్లూరి,,ఎన్టీఆర్,,గుంటూరు,,బాపట్ల,, ప్రకాశం,,నెల్లూరు,,తిరుపతి జిల్లాలో గురు శుక్ర శనివారాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.. గడచిన 24 గంటల్లో విజయనగరం జిల్లాలో 12 సెం.మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.. ముఖ్యంగా కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడనున్నాయి..కొన్నిచోట్ల ఉరుములు పిడుగులు పడే ప్రమాదం ఉంది.. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.