రానున్న మూడు గంటలు పలు జిల్లాలకు పిడుగులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం
2-
నెల్లూరు: రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు పిడుగులతో పాటు కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వున్నదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
రెడ్ అలెర్ట్: విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.
ఆరెంజ్ అలెర్ట్: శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, నెల్లూరు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు
ఎల్లో అలెర్ట్: పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు,అలాగే ఈదురుగాలులు వీచే అవకాశం వున్నదని వెల్లడించారు.